![]() |
![]() |
(1).webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం Jayam . ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ 349 లో.. శకుంతల దగ్గరికి ఫంక్షన్ కి పిలవడానికి కొంతమంది వస్తారు. అందరికి బొట్టు పెట్టి ఆహ్వానిస్తారు అక్కడ ప్రమీల ఉంటుంది. తనకి బొట్టు పెట్టబోతుంటే అక్కడ ఒకావిడ ఉండి తను శకుంతల కోడలు అని చెప్తుంది. ఓహ్ తను బాను వైఫా.... ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి కదా.. కొంచెం అయితే అరిష్టమ్ జరిగేది అని ఆవిడ అంటుంది. అప్పుడే గంగ వస్తుంది. మీరు పేరంటానికి పిలవడానికి వచ్చారు అలాగే ఉండాలి కానీ ఇలా చెయ్యడం కరెక్ట్ కాదని గంగ కోప్పడుతుంది.
మీరు ఆలోచించే విధానం కరెక్ట్ కాదని గంగ కోప్పడుతుంది. ఏంటి గంగ ఇంటికి వచ్చిన వాళ్ళతో అలాగేనా మాట్లాడేది వాళ్ళకి సారీ చెప్పమని ఇషిక అంటుంది. నేను సారీ చెప్పను అని గంగ కోపంగా లోపలికి వెళ్తుంది. దాంతో శకుంతలకి కోపం వస్తుంది. చూసావా శకుంతల అన్న కూడా ఆ పిల్లకి భయం లేకుండా ఉందని వాళ్ళు అంటారు. అప్పుడే రుద్ర వస్తాడు. నా భార్య తరుపున నేను క్షమాపణ అడుగుతున్నాను.. నా భార్య మాటలకి కాదు మా పెద్దమ్మ గౌరవం పోకూడదని రుద్ర చెప్తాడు. ఆ తర్వాత గంగ దగ్గరికి రంగా వస్తాడు. అప్పుడే రుద్ర వస్తాడు.
మీరు నాకు చెప్పడం కాదు ఒకసారి ప్రమీల అక్కని చుడండి ఎలా బాధపడుతుందోనని గంగ అంటుంది. ప్రమీల ఏడుస్తూ ఉండడం రుద్ర చూస్తాడు. మీరే ఒక నిర్ణయం తీసుకోండి అని గంగ అంటుంది. అప్పుడే పెద్దసారు వచ్చి ప్రమీల గురించి మాట్లాడుతాడు. శకుంతలని నేను ఓప్పిస్తానని పెద్దసారు చెప్తాడు. ప్రమీల అక్కని నేను ఓపిస్తానని గంగ అంటుంది. ఆ మాటలన్నీ శకుంతల వింటుంది. నాకు ఇష్టం లేదని చెప్పిన వినట్లేదు కదా అని కోపంగా ఉంటుంది. మరొకవైపు విశ్వకి గంగ గురించి జయ నెగెటివ్ గా చెప్తుంది కానీ విశ్వ నమ్మడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |